Monday, December 23, 2024

10 రోజుల్లో రైతుబంధు సాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం నిధులను జమ చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. రైతుబీమా ఇచ్చే దేశం లేదన్నారు. మరో ఐదు,పది రోజుల్లో రైతుబంధు పడుతుందన్నారు. బ్యాంకుల్లో పడంగనే రైతుల ఫోన్లకు టింగుటింగుమని మెస్సేజ్ వసదన్నారు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చేది కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.

అనాలోచితంగా, ఆగమాగంగా ఇచ్చేది కాదన్నారు. చితికిపోయి ఛిద్రమైన ఆగమైన తెలంగాణ రైతుల బతుకులు ఓదరికి రావాలని, అప్పులు తీరాలని, ఆ బాధలు తప్పాలని తీసుకున్న నిర్ణయమే రైతుబీమా రైతుబంధు అని కెసిఆర్ అన్నారు. అంతటితో ఆగకుండా భారతదేశంలో ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయదన్నారు. ఎక్కడా లేనివిధంగా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే రంది లేకుండా అమ్మిన పంటకు ఐదురోజుల్లోనే బ్యాంకులు డబ్బులు వచ్చేలా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News