ప్రపంచానికే ఆదర్శం.. ఈ వినూత్న పథకం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతుబంధు పథకం లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రైతుకు పెట్టుబడే రైతుబంధు అని, ఈ వినూత్న పథకం ప్రపంచానికి ఆదర్శమని ఆయన తెలిపారు. పెట్టుబడి సాయం చేస్తున్న మహా నేత సీఎం కెసిఆర్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. రైతుబంధు ద్వారా రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న రైతుబంధు కార్యక్రమానికి మేధావులు, అన్నివర్గాల నుంచి మంచిస్పందన వస్తోందన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అందడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, రైతులలో ఆర్థిక ధీమా పెరిగిందని ఆయన తెలిపారు. రైతుబంధుకు తోడుగా పుష్కలంగా సాగునీరు అందడం, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండటంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని వినోద్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం,బిజెపి పాలిత రాష్ట్రాలు అనుకరిస్తున్నాయని, ఇది సిఎం కెసిఆర్‌కు దక్కిన అరుదైన గౌరవం అని ఆయన వివరించారు. రైతు బంధుతోపాటు రైతు బీమాతో రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమాతో 70 వేల మందికి ప్రయోజనం చేకూరిందని ఆయన తెలిపారు. రైతుల సంకేమమే కెసిఆర్ ప్రధాన లక్ష్యం అన్నారు. రైతులు సంతోషంగా ఉండటమే ఏకైక అజెండా సిఎం కెసిఆర్‌ది అని వినోద్‌కుమార్ తెలిపారు.