Tuesday, November 5, 2024

రైతుబంధు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీతో రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలిం గ్ జరుగుతుందని చెప్పారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. 1500 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అదనపు కేంద్రా ల ఏర్పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాము. జిహెచ్‌ఎంసితో పాటు 5 ప్రధాన నగరాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.
రైతుబంధుపై ప్రతిపాదన రాలేదు
రైతుబంధు విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని సిఇఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. వస్తే పరిశీలిస్తామని తెలిపారు. ఇతర పార్టీల నుంచి రైతుబంధుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. ఎన్నికల నియమావళి, నిబంధన ఉల్లంఘన,తనిఖీల్లో 30 బిఆర్‌ఎస్, 16 కాంగ్రెస్, 5 బిజెపి, 3 బిఎస్‌పికి సంబంధించి అనుమానిత కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి దాడి ఘటనపై నివేదిక కోరామని వెల్లడించారు.
నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు.. ఒకే దానికి డిపాజిట్ చెల్లింపు..
అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చని.. డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చె ల్లించాలని వికాస్‌రాజ్ అన్నారు. అఫిడవిట్‌లో అన్ని కాల మ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అఫిడవిట్ అం శంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ముందుగానే పం పిణీ చేయనున్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నాం. పట్టణ ప్రాం తాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ఈసారి పట్ట ణ ప్రాంతాల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. 18 వేల వీల్ చైర్లు ఏర్పా టు చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువ త ఓటు నమోదు చేసుకున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ అందుబాటులో ఉంటుందన్నారు.
తనిఖీల్లో రూ.453 కోట్ల సొత్తు స్వాధీనం
రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిఇఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వి డుదలైన నుంచి ఇప్పటి వరకు రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం. మొత్తంగా 362 కేసులు, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సీ విజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయి. అనుమతుల కో సం 9,630 దరఖాస్తులు వచ్చాయి. ప్రగతి భవన్ నోటీసుల అంశంలో ఎన్నికల సంఘానికి నివేదిక పంపాము. డబ్బులు, ఇతర అంశాలపై బ్యాంకులు, ఇతర విభాగాలను ఎన్నికల సంఘం నిరంతరం పర్యవేక్షిస్తుంది. స్వా ధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించాం. వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు జారీచేశామని వికాస్‌రాజ్ వెల్లడించారు.
375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు
రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ హెచ్చరించారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యం. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తాయని సిఇఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. నవంబర్ 2 తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 3.21.88.753గా ఉందన్నారు. ఇప్పటి వర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News