Tuesday, February 11, 2025

8.6 లక్షల మందికి రైతుభరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలోలోని రెండు ఎకరాల వరకు ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రైతు బరోసా నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,65,999 మంది రైతులకు ఉన్న 11,79, 247.17 ఎకరాలకు మొత్తం రూ.707.54 కో ట్ల నిధులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ మ అయ్యాయి. ఇప్పటికే రెండు విడతల్లో రైతు భరోసా కింద 21,45,330 మంది రైతులకు రూ.1,126.54 కోట్ల నిధులు ప్రభుత్వం రైతులకు అందజేసింది. మొత్తంగా రెండు ఎకరాల వరకు ఉన్న సాగు రైతులకు రైతు బరోసా కింద సోమవారం నాటికి 34.69లక్షల మంది రైతు లకు రూ.2,218.49 కోట్లు వారి బ్యాంకు ఖా తాల్లోకి చేరాయని ప్రభుత్వం ప్రకటించింది.

రై తుల ఆధార్ కార్డును బ్యాంక్ అంకౌంట్లకు అ నుసంధానం చేసి దశల వారీగా ప్రభుత్వం జ మచేస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,85, 545 మంది రైతులు రైతు బరోసా లబ్దిదారులు ఉండగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లాలోని రైతాంగం రూ.1,162.62 కోట్ల నిధులను రైతు బరోసా కింద పొందారు. ప్రభుత్వం రైతు బరోసా కింద నిధులను జనవరి 26వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 27వ తేదీన రాష్ట్రంలోని 577 పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి 4,41,911 మంది రైతులకు 9,48,332.35 ఎకరాలకు రూ.5,689.99 కోట్లను విడుదల చేసింది. ఈనెల 5వ తేదీన ఒక ఎకరం వరకు 17,03,419 మంది రైతులకు 9,29,234.20 ఎకరాలకు రూ.5,575.40 కోట్ల నిధులను విడుదల చేసింది. సోమవారం నాడు రెండు ఎకరాల వరకు 8,65,999 మంది రైతులకు 11,79,247.17 ఎకరాలకు రూ.7,075.46 కోట్ల నిధులను మంజూరుచేసింది.
.

రాష్ట్రంలో జిల్లాల వారీగా సోమవారం(10వ తేదీ) వరకు రైతు భరోసా నిధులు విడుదల వివరాలు
క్రమ సంఖ్య జిల్లా రైతుల సంఖ్య నిధులు రూ.లు
1 ఆదిలాబాద్ 34,401 37,18,21,050
2 కుమురంభీమ్ ఆసీఫాబాద్ 32,634 27,29,52,522
3 మంచిర్యాల 69,961 43,16,53,467
4 నిర్మల్ 75,263 51,17,32,029
5 నిజామాబాద్ 1,42,873 87,77,52,581
6 కామారెడ్డి 1,73,580 90,83,42,036
7 కరీంనగర్ 1,12,689 66,35,04,499
8 పెద్దపల్లి 86,918 50,51,21,067
9 జగిత్యాల 1,29,326 70,78,93,705
10 రాజన్నసిరిసిల్ల 69,012 44,46,82,700
11 మెదక్ 1,72,349 84,40,52,317
12 సంగారెడ్డి 1,82,453 1,06,77,15,270
13 సిద్దిపేట 1,86,241 1,16,26,25,246
14 వరంగల్ 92,024 56,23,30,600
15 హనుమకొండ 85,903 53,44,42,258
16 మహబూబాబాద్ 1,03,662 69,93,24,812
17 ములుగు 32,754 23,25,09,947
18 జయశంకర్ భూపాలపల్లి 50,763 31,40,23,153
19 జనగాం 67,434 40,05,78,753
20 ఖమ్మం 1,21,612 71,36,45,222
21 భద్రాద్రి కొత్తగూడెం 49,947 55,23,55,703
22 రంగారెడ్డి 1,04,938 54,99,01,926
23 వికారాబాద్ 88,340 48,32,42,518
24 మేడ్చెల్ మల్కాజిగిరి 4,931 3,82,20,945
25 మహబూబ్‌నగర్ 91,248 48,32,76,181
26 నారాయణ్‌పేట్ 54,153 34,34,73,497
27 నాగర్‌కర్నూల్ 98,409 61,79,10,579
28 వనపర్తి 68,587 34,40,23,950
29 జోగులాంబ గద్వాల 43,681 29,27,42,293
30 నల్లగొండ 1,85,545 1,13,33,74,857
31 సూర్యాపేట 1,11,752 73,93,34,053
32 యాదాద్రి భువనగిరి 87,946 53,63,29,212
మొత్తం 30,11,329 18,34,08,88,948

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News