మనతెలంగాణ/హైదరాబాద్: రైతుభరోసాకోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతు భరోసాపై మంత్రివర్గానికి చే యాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు కేబినెట్ స బ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ భే టీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగు చే సే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కమిటీ ని ర్ణయించింది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూ మి పరిమితిని పెట్టవద్దని కమిటీ అభిప్రాయపడిం ది. అలాగే, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం మ ల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉప సంఘం ఏర్పాటైంది. ఈ కే బినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయింది. కా గా, అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూ ములను గుర్తించనున్నారు.
జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత సర్కార్ రైతు భరోసాను ఇవ్వనుంది. ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాకు సంబంధించి తుది ని ర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం ఒక కో టీ 53 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది. గుట్టలు, వెంచర్లు, సాగు చేయని భూములకు కూ డా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి ప్రజా ధనా న్ని దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు అలా కా కుండా కేవలం సాగు చేసే భూములకు రైతు భరో సా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ధర ణి పోర్టల్ రికార్డుల ప్రకారం ఒకకోటి 53 లక్షల ఎకరాల వ్య వసాయ భూమి ఉండగా ఇందులో సాగు చేసే భూమి కోటి 30 లక్ష లు ఎకరాలుగా ప్రభుత్వం గుర్తించింది. కేవలం ఈ భూ ములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ సిఎం భట్టి శుక్రవా రం సిఎం ని కలిసి నివేదిక అందజేసినంతరం పథ కం అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది.