Friday, December 20, 2024

రేవంత్ భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త తెలిపింది. రైతుభరోసా పధకం కింద సోమవారం నిధులు విడుద ల చేసింది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుబంధుగా ఉన్న ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రై తుభరోసా పథకంగా మార్చి వేసింది. రాష్ట్రంలో యాసంగి సీజన్ కింద పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతుభరోసా నిధుల విడుదల కొంత మేరకు పూర్తయ్యా యి. కొన్ని కారణాల వల్ల పెట్టుబడి సాయం కిం ద నిధుల విడుదల 5ఎకరాలు ఆపైన రైతులకు నిలిచిపోయింది. ఈ నెల 8లోపు ఎట్టిపరిస్థితుల్లోనైనా సరై రైతుభరోసాకు నిధులు విడుదల చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన 24గంటలైనా గడవకముందే ప్రభుత్వం నిధుల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.2వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వ్యవసాయశాఖ రైతు భరోసా నిధులకు సంబంధించిన రైతుల జాబితాలను ఆర్థిక శాఖకు అందజేసి ఉన్నందున రైతుల ఖాతాలకు రైతుభరోసా నిధుల జమ ప్రక్రియ మరింత సులువుగా మారింది.

రాష్ట్రంలో రబీ సీజన్‌కింద మొత్తం 65లక్షల మంది రైతులకు రైతుభరసా పథకం కింద 7500కోట్ల రూపాయలు జమ చేయాల్సివుండగా ఇందులో 80శాతం పైగా రైతులకు నిధుల జమ ఇది వరకే పూర్తయింది.5ఎకరాల విస్తీర్ణం లోపు పోలం ఉన్న రైతులందిరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఇదివరకే నిధులు జమ అయ్యాయి. 5 ఎకరాలు , ఆపైన ఉన్న రైతులకు మాత్రమే నిధుల విడుదల ఇంతకాలం పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుబంధు పథకానికి గండి పెడుతోందని , 5 ఎకరాల వరకు మాత్రమే ఈ పధకానికి సీలింగ్ విధిస్తోందని ప్రతిపక్ష పార్టీల నుంచి పలు రకాల విమర్శలు వచ్చాయి. 5 ఎకరాల పైబడి ఇక రైతులను ప్రభుత్వం ఈ పథకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చిందన్న విమర్శలకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి సర్కారు నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాలను నిధుల జమ ప్రారంభ ం కానుంది. తొలిరో జు 5 ఎకరాల రైతులకు నిధులు జమ కానున్నాయి . ఆ మరు నాటి నుంచి ఎకరం చొప్పున పెంచుతూ రైతులందరికీ నిధుల జమ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News