Tuesday, January 21, 2025

సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. జనవరి నాటికి రైతుబంధు విధివిధానాలు రూపొందిస్తామని వివరించారు. పట్టాదారుల బ్యాంకు ఖాతాలను సేకరించి రైతుబంధు పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తున్నామని తెలియజేశారు. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రారంభించిందని, ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాల ప్రకారం రైతుబంధు ఇచ్చారని, రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.80,453 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు.

భూమి ఉన్నవారు సాగు చేసినా, చేయకపోయినా రైతుబంధుకు అర్హులయ్యారని తుమ్మల మండిపడ్డారు. సిసిఎల్‌ఎ నుంచి అందిన భూవిస్తీర్ణంలో మార్పులు చేయడానికి అనుమతి లేదన్నారు.2023-24లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7625 కోట్లు చెల్లించిందన్నారు. 2018 నుంచి పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారిందన్నారు. ఎఇఒలు యాప్‌లు సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News