Monday, December 23, 2024

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: కాకాణి

- Advertisement -
- Advertisement -

అమరావతి: రైతు బాగుంటేనే ఎపి రాష్ట్రం బాగుంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుకు భరోసా కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మే వ్యక్తి సిఎం జగన్ మోహన్ రెడ్డి అని, ఏ సీజన్‌లో పంట నష్టం ఆ సీజన్‌లోనే అందిస్తున్న ఏకైక సిఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. దేశంలోనే వందశాతం రైతు బీమా ప్రీమియం భరించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. చంద్రబాబు హయాంలో అన్నీ కరువు కాటకాలే వచ్చాయని మండిపడ్డారు. మూడో విడత రైతు భరోసా పిఎం కిసాన్ నిధులు సిఎం జగన్ విడదల చేయనున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1090 కోట్లు జమ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News