Monday, December 23, 2024

రైతుబీమా దరఖాస్తుల గడువు ఆగస్ట్ 1కి పొడిగింపు

- Advertisement -
- Advertisement -

v

కొత్త రైతులకోసం మరో అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలకు అండగా కేసిఆర్ సర్కారు అమలు చేస్తున్న రైతుబీమా పధకం కోసం దరఖాస్తుల చివరిగడువును వచ్చేనెల 1వరకూ పొడిగించింది. ఈ పధకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన చివరిగడువు ఈ నెల 22తోముగిసి పోయింది. అయితే అన్ని అర్హతలు ఉండికూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో రైతుల విజ్ణప్తుల మేరకు ప్రభుత్వం ఈ పథకం దరఖాస్తుల దాఖలు చివరిగడువును ఆగస్ట్ 1వరకూ పొడిగించింది.గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 22వరకూ రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందిన వారిలో 18ఏళ్లు పైబడి 59ఏళ్ల వరకు ఉన్న వారంతా రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్కు , ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను తెలిపే పాస్‌బుక్ జిరాక్స్ ప్రతుతలతో రైతుబీమా ధరఖాస్తులను సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని ప్రభుత్వం వివరించింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆగస్ట్ 14నుంచి ఏడాదిపాటు రైతుబీమా పథకం వర్తిస్తుంది. రైతు ఏకారణం వల్లనైనా మృతి చెందితే ఆ రైతుకుంటుబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా రూ.5లక్షలు రైతుకుటుంబ సభ్యులకు అందజేస్తుంది. గత ఏడాది ఆగస్ట్ 14నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 13వరకూ రైతుబీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 35.64లక్షల మంది రైతుల పక్షాన రూ.1465కోట్లు ఎల్‌ఐసి సంస్థకు ప్రీమియం కింద చెల్లించింది. కొత్త రైతుల చేరికతో ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబీమా ప్రీమియం ఈ ఏడాది మరింతగా పెరగనుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News