Thursday, January 23, 2025

ఈనెల 30 వరకు రైతుబీమాకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈనెల 30 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏవో కె.స్వప్న తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 18 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన వారు, తహసీల్దార్ డిజిటల్ సంతకం పూర్తయి 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, నామినీ ఆధార్ జిరాక్స్ పత్రాలతో సంబంధిత ఏఈవోల వద్ద దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Also Read: రాహుల్ గాంధీ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News