Thursday, January 23, 2025

నేటితో రైతుబీమాకు ఐదేళ్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుబీమా పథకానికి నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రాము మీడియాతో మాట్లాడారు. అర్హులైన రైతుల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సాయం చేస్తామని హరీష్ రావు వెల్లడించారు. 2018-19లో 31.25 లక్షల మంది రైతు బీమాలో నమోదు, 2023-24లో 41.04 లక్షల మంది రైతుబీమాలో నమోదు, 2023-24లో 41.04 లక్షల మంది రైతు బీమాలో నమోదు చేసుకున్నారని హరీష్ రావు వెల్లడించారు. రైతుబీమా ప్రీమియంగా నేడు రూ.1477 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రైతు బీమా కోసం రూ.6861 కోట్లు చెల్లించామన్నారు. రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5402 కోట్ల పరిహారం అందించామని, గుంట భూమి ఉన్న రైతుగా గుర్తించి రైతు బీమా ఇస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

Also Read: కేజ్రీవాల్‌తో భేటీకానున్న నితీశ్ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News