రాజన్నసిరిసిల్ల: రైతు వేదికను రైతులకు అంకితం చేస్తున్నామని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. గంభీరావుపేటలో రైతు వేధికను ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు తన సొంత ఖర్చులతో ఐదు మండల కేంద్రాల్లో రైతు వేదికలను నిర్మించామన్నారు. కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని, ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదిక నిర్మించామన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ తెలిపారు. రైతు రుణమాఫీ దఫదఫాలుగా చేస్తామన్నారు. తెలంగాణ రాకముందుకు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలన్నారు. గతంలో కరెంట్ కోసం రైతులు గోస పడ్డారని, ఎన్నడూ 6 గంటల కరెంటు ఇవ్వలేదని, లో ఓల్టేజ్‌తో మోటార్లు కాలిపోయేవని, గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇవాళ కడుపు నిండా కరెంట్ ఇస్తున్నామని, గతంలో అర్ధ రాత్రి కరెంట్ ఇస్తే పాములు కరిచి రైతులు చనిపోయారని గుర్తు చేశారు. రైతుల గురించి 70 ఏళ్లలో కెసిఆర్‌లా ఏ ముఖ్యమంత్రి ఐనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.
కెసిఆర్ ఆలోచనల మేరకే రైతు వేదికలు: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -