Monday, December 23, 2024

తొలకరికి ముందే రైతుబంధు

- Advertisement -
- Advertisement -

Rythubandhu funds will release on june

 

ఈ వానాకాలం అదనంగా
4లక్షల మందికి అవకాశం

ఈ వానాకాలం అదనంగా 4లక్షల మందికి
జూన్ తొలివారంలోనే ఖాతాలకు సొమ్ము
ఖజానాపై రూ.200కోట్లు అదనపు భారం!
బడ్జెట్‌లో సాగుకు రూ.24254కోట్లు
రైతుబంధు కోసమే రూ.15000కోట్లు

మన హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేసిఆర్ సర్కారు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి తొలకరికి ముందుగానే రైతుబంధు పథకం నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తోంది. నైరుతి రుతుపవనాలు ఈ సారి జూన్ 10నాటికే తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్టు వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలతో రైతులు వానాకాల పంటల సాగుపై తదితర ఖర్చుల కోసం పంటల సాగు పెట్టుబడి కింద ప్రభుత్వం ఈ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే నిధులు జమ చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో 2018నుంచి అమల్లో ఉన్న ఈ పథకం ద్వారా ప్రతియేటా క్రమం తప్పకుండా అమలు చేస్తోంది. వానాకాలం , యాసంగి సీజన్లలో ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5000 వంతున రెండు ధఫాలుగా మొత్తం రూ.10,000 రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తోంది. గత సీజన్‌కు సంబంధించి 62.99లక్షల మంది రైతులకు ఈ పథకం కింద నిధులు అందజేసింది. మొత్తం రూ.7,411.52కోట్లు అందజేసింది.

కొత్తగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందటంతో కొత్త రైతులకు కూడా వానాకాలంలో రైతుబంధు పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా సూమారు 2లక్షల మంది రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందారు. ఈ నెలాఖరు నాటికి భూమి యాజమాన్య హక్కులు పొందిన వారందరికీ రైతుబంధు పథకానికి వర్తింపచేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త రైతులకు కూడా ఈ పథకం వర్తింపచేస్తే ప్రభుత్వ ఖజానాపై అదనంగా మరో రూ.200కోటు భారం పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని రంగాలు దెబ్బతిని ,వ్యాపార లావాదేవీలు మందగించి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు తగ్గినప్పటికీ , రైతుబంధు పథకంపై ఆ ప్రభావం ఏమాత్రం పడకుండా ప్రభుత్వం రైతుబంధును విజయవంతంగా అమలు చేసింది. ఒకవైపున పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు , మరో వైపు ఇంకా కరోనా దెబ్బనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్ధికరంగం , ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఏ మాత్రం వెనుదీయకుండా కొత్త రైతులకు రైతుబంధు పధకం అమలు చేయటం కేసిఆర్ సర్కారు సాహసోపేత చర్యగా పేర్కొంటున్నారు.

బడ్జెట్‌లో రూ.15000కోట్లు:

రాష్ట్రంలో వ్యసాయరంగం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం వంటి భారీ సాగునీటి పధకాలను నిర్మించటంతో సాగు నీటివనరుల లభ్యత పెరిగింది. ఈ అందుకు తగ్గట్టుగానే ఈ వానాకాలం కోటి 40లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి తేవాలని వ్యవసాయాశాఖ ఇప్పటికే ప్రాధమిక లక్ష్యాలను ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 202223 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూజ24,254కోట్లు కేటాయించింది. ఇందులో రైతుబంధు పథకం అమలు కోసమే రూ.15000కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున పెట్టుబడి సాయం లభిస్తుండటంతో రైతులు కూడా పంటల సాగులో ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News