Monday, December 23, 2024

రాష్ట్రాల చూపు సాగు పథకాల వైపు

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న రైతుబంధు అన్నదాతల
కుటుంబాలకు భరోసా రైతుబీమా నిరంతరాయ
విద్యుత్‌తో వ్యవసాయ రంగంలో కొత్త కాంతులు
తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలంటున్న కర్షకులు

మన తెలంగాణ/హైదరాబాద్ :రైతుల అభ్యన్నతే లక్షంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సర్కారు వ్య వసాయరంగంలో అమలు చేస్తు న్న పథకాలే దేశానికి దశ దిశ చూపుతున్నా యి. రైతుబంధు, రైతుబీమా, పంటల సాగు కు ఉచిత విద్యుత్ తదితర తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రా ల్లో కూడా అమలు చేయాలని ఇప్పటికే దక్షిణా ది రాష్ట్రాల్లో రైతులు, సంఘాల నేతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జాతీయ రైతు సంఘాల సమాఖ్య ఆ ధ్వర్యంలో జరిగిన సమావేశం తెలంగాణ మో డల్ వ్యవసాయ పథకాలు జాతీయ స్థాయిలో అమలు చేయాలని , రైతుల సంక్షేమానిక బాసటగా నిలిచే బిజేపియేతర పార్టీలకే తమ సంపూ ర్ణ మద్దతు ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలోనే ఢిల్లీలో తెలంగాణ మోడల్ వ్యవసాయ పథకాలపై దేశంలోని అన్ని రాష్ట్రా ల రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం కా బోతున్నారంటే ఇక్కడి వ్యవసాయ పథకాల ప వర్ ఏమిటో స్పష్టమవుంతోంది. తెలంగాణ రా ష్ట్ర రైతాంగం చెమటోడ్చి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చేవలేక కేంద్ర ప్రభుత్వ కూడా చేతులెత్తేసే దశకు చేరేంతగా వ్యవసా యం పురోగమిస్తోంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబందు పథకం వ్యవసాయరంగపై చెరగని ము ద్ర వేసింది. కెసిఆర్ మేధోమధనం నుంచి పుట్టుకొచ్చిఈ పథకం ఇప్పడు అన్నిరాష్ట్రాలకు ఆచరనీయంగా మారుతోంది. మరే ప్రభుత్వం వచ్చినా ఈ పథకాన్ని చేరపలేనంత బలంగా పునాదులు వేసుకుంది. రైతుబంధు పథకం ద్వారా 64లక్షల మంది రైతులు పంటల సాగుకు పెట్టుబడి సాయంగా లబ్ధి పొందుతున్నారు. ప్రతిఏటా ఈ పథకం కోసం కేసిఆర్ సర్కారు రాష్ట్ర బడ్జెట్‌లో 15వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రతిఏటా వానాకాలం , యాసంగిలో ఎకరానికి పది వేల రూపాయలు పంటల సాగుకు ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద తొమ్మిది విడతలుగా రూ.58వేలకోట్లు రైతులకు అందజేసింది. ఈ పథకం ద్వారా 80శాతం పైగా సన్న , చిన్న కారు రైతులే లబ్దిపోందుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమిస్తూ ఇంటిల్లిపాదిని పోషిస్తున్న రైతు ఆకాల మృతి చెందితే ఆ కుటుంబానికి అర్దికంగా అండగా నిలిచేందుకు సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పధకం వ్యవసాయ కుటుంబాలకు భరోసాగా నిలిచింది.

కారణం ఏదైనా మృతి చెందిన రైతు కుటంబానికి ప్రభుత్వం రూ.5లక్షలు సాయం అందజేస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం తొలిఏడాది 31.25లక్షల మంది రైతులకు ప్రీమియంగా రూ.602కోట్లు ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ఈ పథకం కింద 37లక్షల మంది రైతులకు రూ.1446కోట్లు చెలించింది. రైతుబీమా పధకం ద్వారా ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 84945మంది రైతుల కుటుంబాలకు రూ.4247కోట్లు సాయం అందజేసింది. వ్యవసాయ కుటుంబాలకు పెద్దదిక్కుగా నిలిచిన ఈ పథకం అమలు తీరుతెన్నులపై నీతి ఆయోగ్ సైతం ప్రశంసల జల్లు కురిపించటంతో ఇప్పడు అన్ని రాష్ట్రాలు ఈ పథకం వైపు చూస్తున్నాయి. పంటల సాగుకు ఉచిత విద్యుత్‌పంపిణీ పధకం తెలంగాణకు వ్యవసాయరంగంలో నూతన వెలుగులు నింపింది. రాష్ట్రంలో 25లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వమే విద్యుత్ పంపిణీ సంస్థలకు రైతుల పక్షాన ఏటా రూ.12వేలకోట్లు చెల్లిస్తోంది.

ధాన్యం ఉత్పతి ..కొనుగోళ్లలో సరికొత్త రికార్డు:

ప్రభుత్వం అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తామని తెలంగాణ రైతులు నిరూపిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ధాన్యం ఉత్పత్తిని సాధిస్తున్న రైతాంగం తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా నిలిపింది. రాష్ట్రంలో ఈ వానాకాలం కోటి 36లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు. 64లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ప్రభుత్వం కోటి 15లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడిని అంచాన వేసింది. దేశమంతటా కలిపి ఈ ఖరీఫ్‌లో 5.18కోట్ల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది .అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కోటి టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం ఉందంటే ధాన్యం ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి స్పష్టమవుతోంది. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. ఆ తరువాత ఎఫ్‌సిఐకి సరఫరా చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే ఏటా రూ.25వేల కోట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సమకూర్చి ధాన్యం సేకరణకు ప్రోత్సహిస్తోంది. కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయరంగలో సాధిస్తున్న ప్రగతి దేశానికి దిక్సూచిగా నిలుస్తూ మిగిలిన రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News