Wednesday, January 22, 2025

సుస్థిర ప్రపంచం కోసం ఐరోపా యూనియన్ కలిసి రావాలి : ఎస్.జైశంకర్

- Advertisement -
- Advertisement -

S Jaishankar calls for EU-France engagement

పారిస్ : సుస్థిర బహుళ ధ్రువప్రాంతం, సుస్థిర ప్రపంచం కోసం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ కలిసి రావాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఆధిపత్య ధోరణులను ఎదిరించడం చాలా ముఖ్యమని, లేనిపక్షంలో అసమానతలను సృష్టించే శక్తులు ఐరోపాకు కూడా వ్యాపిస్తాయని హెచ్చరించారు. ఇండో పసిఫిక్‌పై జరిగిన యూరోపియన్ యూనియన్ మినిస్టీరియల్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో బలమైన భాగస్వామ్యం, ప్రయోజనాలు యూరోపియన్ యూనియన్‌కు, ఫ్రాన్స్‌కు ఉన్నాయని, ఈ ప్రాంతం భద్రతకు ఈ రెండూ కట్టుబడి ఉండాలని కోరారు.

సమష్టి కృషి వల్ల ఈ సముద్రాలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. ఇదే సమయంలో ఈ సముద్రాల వనరులను పరిరక్షించ వచ్చని, పరిశుభ్రంగాఉంచవచ్చని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌కు ఆర్థిక బలం, నైపుణ్యం ఉన్నందున ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి , మౌలిక సదుపాయాలు, అనుసంధానం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, ఆరోగ్యం, భద్రత వంటి అంశాల్లో తన వంతు పాత్రను పోషించవచ్చని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారని, తెలిపారు. భారత దేశ వైఖరి చాలా విశాలమైనదని, ఉమ్మడి లక్షం కోసం వివిధ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని భారత్ కోరుకుంటోందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News