సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఎస్ఎస్ఎంబి మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులు గుడ్ న్యూస్. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ కోసం లోకేషన్స్ సెర్చ్ చేసిన రాజమౌళి ఫైనల్ గా షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాగాజా ఈ స్టార్ డైరెక్టర్..ఈ మూవీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింహాన్ని లాక్ చేసినట్లు పాస్ పోర్ట్ చూపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
దీనికి మహేష్ బాబు.. ఒక్కసారి కమిట్ అయితే..నా మాట నేనే వినను అనే పోకిరి సినిమాలోని డైలాగ్ తో రిప్లే ఇచ్చారు. దీంతో వీరి కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభించారని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అలాగే, రాజమౌళి ట్వీట్ కు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించడంతో.. ఎస్ఎస్ఎంబి29లో ఈ బ్యూటీనే హీరోయిన్ అని ఫిక్స్ అవుతున్నారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, ఈ మూవీని యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా పాన్ వరల్డ్ లెవల్ లో రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం ఇండియాతోపాటు పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం.