Monday, December 23, 2024

‘దసరా’పై జక్కన్న ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ నాని బ్లాక్‌బస్టర్ మూవీ ‘దసరా’పై సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రభాస్ ఈ చిత్రాన్ని పొగిడారు. తాజాగా టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి ప్రశంసిస్తూ మాట్లాడుతూ “బొగ్గు గనుల వాతావరణం, కఠినమైన పాత్రల మధ్య డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రేమ కథను అద్భుతంగా ఆవిష్కరించారు.

నాని కెరీర్ లోనే అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. కీర్తి సురేశ్ తన పాత్రను సునాయాసంగా పోషించారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News