Monday, January 20, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

ముంబయి: వరల్డ్ కప్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సపారీలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సపారీలు 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(07), రీజా హెండ్రిక్స్ (10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా దూరం కావడంతో అతడి స్థానంలో మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పేస్ బౌలర్ లుంగీ ఎంగిడీ గాయపడడంతో అతడికి బదులుగా విలియమ్స్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ జట్టులో తాహిద్ హృదయ్‌కు బదులుగా షకీబ్ జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News