Wednesday, March 5, 2025

ఫైనల్ చేరేదెవరో?

- Advertisement -
- Advertisement -

నేడు కివీస్‌తో సఫారీ సెమీస్ పోరు

లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్ పోరుకు న్యూజిలాండ్, సాతాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య లా హోర్ వేదికగా పోరు జరుగనుంది. గ్రూప్‌ఎ నుంచి రెండో స్థానంలో నిలిచి కివీస్ సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్‌బిలో అగ్రస్థానా న్ని దక్కించుకున్న సౌతాఫ్రికా కూడా సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇటీవల కాలంలో రెండు జట్లు కూడా అద్భుత ఆట తో అలరిస్తున్నాయి. లీగ్ దశలో సౌతాఫ్రికా అజేయంగా నిలిచింది. అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ జట్లపై అలవోక విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. కివీస్ లీగ్ దశలో రెండు విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఓడించింది. అయితే భారత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికాతో జరిగే పోరు న్యూజిలాండ్‌కు పరీక్షగా తయారైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సెమీస్ సమరం రసవత్తరంగా సాగడం ఖాయం.

ఫేవరెట్‌గా కివీస్..

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకం గా ఉంది. విల్ యంగ్, డెవోన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిఛెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీం ద్ర వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. యంగ్, లా థమ్, రచిన్‌లు ఇప్పటికే సెంచరీలతో సత్తా చాటారు. విలియమ్సన్, లాథమ్, ఫిలిప్స్‌లు కూడా నిలకడైన ఆటతో అలరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లపై జట్టు భా రీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు యంగ్, కాన్వేలు చెలరేగితే కివీస్‌కు ఎదురే ఉండదు.అంతేగాక లాథమ్, విలియమ్సన్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు ఉండనే ఉన్నా రు.

రచిన్, ఫిలిప్స్‌లు జోరుమీదున్నారు.

బౌలింగ్‌లో కూడా కివీస్ బలంగానే ఉంది. మ్యాట్ హెన్రీ, బ్రేస్‌వెల్, ఓరౌర్కే, కెప్టెన్ సాంట్నర్‌లతో పటిష్టమైన బౌలిం గ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు సౌతాఫ్రికా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా ఉంది. ఓపెనర్ రికెల్టన్, కెప్టెన్ బవుమా, వండ ర్ డుసెన్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్ తదితరులతో బ్యా టింగ్ చాలా పటిష్టంగా ఉంది. రికెల్టన్ ఇప్పటికే సెంచరీతో అలరించాడు. వండర్ డుసెన్ కూడా జోరుమీదున్నా డు. డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్ చెలరేగితే సఫారీకి ఎదురే ఉండదు. ఇక హెన్రిచ్ క్లాసెన్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో క్లాసెన్, డుసెన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఎంగిడి, రబడా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాకుకూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News