దుబాయి: మహిళల టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళా టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టెఫాని టెలర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 44 పరుగులు చేసింది. మిగతా వారిలో జైదా జేమ్స్ 15 (నాటౌట్), డియాండ్ర డాటిన్ (13), వికెట్ కీపర్ క్యాంప్‌బెల్ (17), ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ హేలీ మాథ్యూస్ (10) మాత్రమే రెండంకెల స్కోరును అదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు లౌరా వాల్‌వర్డ్, తంజీమ్ బ్రిట్స్‌లో అజేయ అర్ధ శతకాలతో జట్టును గెలిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 55 బంతుల్లో ఏడు ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరో ఓపెనర్ బ్రిట్స్ ఆరు బౌండరీలతో అజేయంగా 57 పరుగులు సాధించింది. దీంతో సౌతాఫ్రికా పది వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది.
సౌతాఫ్రికా ఘన విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -