Thursday, January 23, 2025

‘ఛాంగురే బంగారురాజా’ నుంచి ‘సామిరంగ’ పాట విడుదల

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ యువ, ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ తో కంటెంట్-రిచ్ సినిమాలను తీయడానికి ఆర్టీ టీమ్‌వర్క్స్ ని స్థాపించారు. ఆర్ టీ టీమ్‌వర్క్స్ లేటెస్ట్ ప్రొడక్షన్ “ఛాంగురే బంగారురాజా”. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి చిత్రాన్ని రవితేజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యుసర్స్. ‘C/O కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ కథానాయిక. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Saamiranga song from Changure Bhangaru Raja outతాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగల్ సామిరంగా పాటనివిడుదల చేశారు మేకర్స్. కృష్ణ సౌరభ్ ఈ పాటని క్యాచి ట్యూబ్ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్ పాడిన ఈ పాటకు కృష్ణ చైతన్య ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో కార్తీక్ రత్నం డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. ఈ చిత్రం కోసం సతీష్ వర్మ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్రెష్ క్రైమ్ జానర్‌ని ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్. ఛాంగురే బంగారురాజా విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News