Monday, December 23, 2024

కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం

- Advertisement -
- Advertisement -

Saana Kastam Song from Acharya

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘సానా కష్టం’ అనే మూడో పాట లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫుల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌తో స్టెప్పులు వేయిస్తోంది. ‘కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం.. కల్లోలం కల్లోలం కిందా మీదా కల్లోలం నా అందం అల్లకల్లోలం..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ… చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ..’ అంటూ చిరు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. మెగా బాస్ డ్యాన్స్‌లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని ’సానా కష్టం’ సాంగ్ నిరూపిస్తోంది.

థియేటర్స్‌లో విజిల్స్ గ్యారంటీ అని సూచిస్తోంది. ఇందులో చిరంజీవితో కలిసి హాట్ బ్యూటీ రెజీనా కాసాండ్రా ఆడిపాడింది. చిరుకు పోటీగా చిందులు వేస్తూ మెప్పించింది రెజీనా. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయగా… మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్‌ను సింగర్స్ రేవంత్, – గీతామాధురి హుషారుగా ఆలపించారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News