Wednesday, January 22, 2025

సబలెంకా, రిబకినా ముందంజ

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)లు రెండో రౌండ్‌లో విజయం సాధించారు. జ్వరేవ్ 76, 62, 62తో గోఫిన్‌ను ఓడించాడు. దిమిత్రోవ్ 60, 63, 64తో మరోజ్‌సన్‌ను ఓడించాడు. మెద్వెదేవ్‌కు రెండో రౌండ్‌లో వాకోవర్ లభించింది. టాప్ సీడ్ జకోవిచ్ రెండో రౌండ్‌లో స్పెయిన్ ఆటగాడు బయెనాపై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంకా 62, 62తో మొయుకా (జపాన్)ను ఓడించింది. రిబకినా 63, 64తో అరాంట రూస్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News