Tuesday, November 5, 2024

క్వార్టర్ ఫైనల్లో సబలెంక, జ్వరేవ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ లో రెండో సీడ్ అరినా సబలెంక (బెలారస్), ఏడో సీడ్ జెంగ్ (చైనా) ప్రిక్వార్ట ర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నా లుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 20వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫోయ్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వరేవ్ 36, 61, 62, 62 తేడాతో అమెరికాకు చెందిన బ్రాండన్ నక్షిమాను ఓడించాడు. తొలి సెట్‌లో జ్వరేవ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన బ్రాండన్ అలవోకగా సెట్‌ను దక్కించుకు న్నాడు. కానీ ఆ తర్వాత జ్వరేవ్ పుంజుకున్నాడు. తన మార్క్ ఆటతో ముం దుకు సాగాడు.

అద్భుత షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. బ్రాండన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా సాగాడు. ఇదే క్ర మంలో వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తొ లి సెట్‌లో గెలిచిన బ్రాండన్ ఆ తర్వాత పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. మరో మ్యాచ్‌లో ఫ్రాన్సిస్ 64, 76, 26, 63తో ఆస్ట్రేలియా సంచల నం పాప్రియన్‌ను ఓడించాడు. జకోవిచ్‌పై సంచలన విజయం సాధించిన పాప్రియన్ ఈసారి మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఫ్రాన్సిస్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ జెంగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతి కష్టం మీద విజయం సాధించింది. డొనా వెకిక్ (క్రొయే సియా)తో జరిగిన పోరులో జెంగ్ 76, 46, 62 తేడాతో జయకేతనం ఎగుర వేసింది.

ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీ గా సాగిన తొలి సెట్‌లో జెంగ్ విజయం సాధించింది. కానీ రెండో సెట్‌లో వెకిక్ జయభేరి మోగించింది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో జెంగ్ పుంజుకుంది. అద్భుత షాట్లతో ప్రత్రర్థిని ముప్పుతిప్పలు పెట్టిన జెంగ్ సునాయాస విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో సబలెంక 62, 64తో మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించి ముందంజ వేసింది. కాగా, మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తన దేశానికే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారొతో జరిగిన పోరులో గాఫ్ ఓటమి పాలైంది. అద్భుత ఆటను కనబరిచిన నవారొ 63, 46, 63తో గాఫ్‌ను మట్టికరిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News