Thursday, April 3, 2025

శబరి ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: శబరి ఎక్స్‌ప్రెస్‌ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుంటూరులో రైల్వే ట్రాక్ కు అడ్డంగా గుర్తు తెలియని దుండగులు ఇనుప రాడ్లు కట్టారు. నగరంలోని కంకరగుంట గేట్ సమీపంలో రైల్వే ట్రాక్ కు అడ్డంగా ఇనుప రాడ్లను అమర్చారు. సకాలంలో గుర్తించి శబరి ఎక్స్‌ప్రెస్ ను డ్రైవర్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇనుపరాడ్లను తొలగించారు. ఈ ఘటనపై రైల్వే యాక్ట్ 154, 174C క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News