Monday, December 23, 2024

కొత్త థ్రిల్‌నిచ్చే ‘శబరి’

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “శబరి సినిమాలో టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి.

ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా ’శబరి’. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. ఈ సినిమాలో ఓ సాధారణ అమ్మాయిగా కనిపిస్తా. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది.

ఆమెకు ఏమైంది? అనేది కథ. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం నాకు వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. ఇక ప్రస్తుతం నేను చేసిన ’కూర్మ నాయకి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్‌తో ’మ్యాక్స్’ చేశా. మరో రెండు, మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News