Saturday, January 11, 2025

శబరిమల భక్తుల కోసం 34 అదనపు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శబరిమల భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుండి 34 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. జనవరి 7,14, 21,28 తేదీల్లో హైదరాబాద్‌కొట్టాయం, జనవరి 8, 15, 22, 29 తేదీల్లో కొట్టాయంసికిందరాబాద్, జనవరి 3,10,17,24, 31 తేదీల్లో మౌలా అలీ కొట్టా యం, జనవరి 4, 11, 18, 25, ఫిబ్రవరి 1 తేదీల్లో కొ ట్టాయం సికిందరాబాద్, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో కాచిగూడకొట్టాయం, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో కొ ట్టాయంకాచిగూడ, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో మౌలా అలీ కొల్లాం, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో కొల్లాం మౌలా అలీ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌కొట్టాయంసికిందరాబాద్‌ప్రత్యేక రైళ్లు బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, సులేహల్లి, యాద్గి ర్, క్రిష్ణ, రాయిచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్ , గూటీ, యర్రగుంట్ల, పలక్కాడ్, త్రిసుర్, అలువ, ఎర్నాకుళం స్టేషన్‌లలో ఆగుతాయి.
మౌలా అలీకొట్టాయం సికిందరాబాద్ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్‌పడి, జోలార్‌పెట్టాయి, సలేం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువ, ఎర్నాకులం, ఎటుమన్నూర్ స్టేషన్‌లలో ఆగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News