Friday, December 20, 2024

మండ‌ల పూజ కోసం తెరుచుకున్న శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం

- Advertisement -
- Advertisement -

పాతాన‌మిట్టై: శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌కు చెందిన మండ‌ల పూజా సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఇవాళ అయ్య‌ప్ప ఆల‌యాన్ని తెరిచారు. వేల సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకున్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ప్ర‌ధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ఆల‌య ద్వారాల‌ను తెరిచారు. త‌లుపులు తీయ‌గానే.. ‘శ‌ర‌ణం అయ్య‌ప్ప’ అంటూ శ‌బ‌రిమ‌ల హోరెత్తిపోయింది. శుక్ర‌వారం నుంచే స‌న్నిధానంకు భ‌క్తుల రాక మొద‌లైంది. వ‌ర్చువ‌ల్ క్యూ విధానం ద్వారా శ‌నివారం 70 వేల మంది భక్తులు బుకింగ్ చేసుకున్నారు. స్పాట్ బుకింగ్‌ల ద్వారా మ‌రో 10 వేల మంది బుక్ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది.

ప్ర‌తి రోజు నెయ్యి అభిషేకం తెల్ల‌వారుజామున 3.30 నిమిషాల‌కు ప్రారంభం అవుతుంది. ఉద‌యం 7.30 నిమిషాల‌కు ఉషా పూజ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు  ఉచ్ఛ పూజ నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నిమిషాల‌కు దీపారాధాన ఉంటుంది. రాత్రి 9.30 నిమిషాల‌కు అత‌జాపూజ నిర్వ‌హిస్తారు. భారీ సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌న స‌మ‌యాన్ని రోజుకు 18 గంట‌ల‌కు పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News