Wednesday, January 29, 2025

శబరిమలలో మండల పూజ

- Advertisement -
- Advertisement -

శబరిమల అయప్పస్వామి ఆలయంలో గురువారం శుభప్రదమైన మండలపూజ జరిగింది. దీంతో 41 రోజులపాటు సాగిన వార్షిక తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. భక్తిప్రపత్తులతో మండల పూజను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నిర్వహించారు.గమనించాల్సిన విషయం ఏమిటంటే బంగారు వస్త్రధారణ(థంక అంకి)లో ప్రధాన దేవుడి(అయ్యప్ప) విగ్రహాన్ని బుధవారం సాయంత్రమే సన్నిధానం(మందిర సముదాయానికి) తీసుకొచ్చారు. ‘హరివరాసనం’ పారాయణంతో మందిరాన్ని రాత్రికి మూసేయనున్నట్లు మందిర అధికారులు తెలిపారు. అంతేకాక వారు శబరిమల మందిరాన్ని మకర విళక్కు వేడుకకు డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరువనున్నట్లు వెల్లడించారు. మందిర ప్రధాన పూజారి కందరరు రాజీవరు దేవతా విగ్రహానికి బంగారు వస్త్రధారణ కట్టి అర్చక క్రతువులు నిర్వహించారు.

కేరళ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు సన్నిధానానికి చేరుకుని గంటలకొద్దీ సమయం వరుసలో నిలుచున్నారు. వారంతా మండల పూజ క్రతువును దగ్గర నుంచి తిలకించారు. ట్రావంకోర్ దేవస్థానం బోర్డు ప్రముఖ అధికారులు కూడా దీనిని తిలకించారు. గణాంకాల ప్రకారం బుధవారం నాటికి 32.5 లక్షల మంది భక్తులు శబరిమల అయ్యప్పస్వామి మందిరాన్ని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4.07 లక్షలు ఎక్కువ మంది భక్తులు దర్శించుకున్నారు. 2023లో 28.42 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా గురువారం మధ్యాహ్నం దాదాపు 20వేల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని టిడిబి అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News