- Advertisement -
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం శనివారం మకరవిలక్కు ఘట్టానికి స్వాముల కోసం తెరుచుకుంది. సాయంత్రం ఈ శుభ కాలాన్ని ఆలయ ప్రధాన పూజారి పిఎన్ మహేష్ నంబూత్రి ఆరంభించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలో శాస్త్రోక్త సాంప్రదాయాలు మేళించుకుని తంత్రి పూజారి కందరరు మహేష్ మోహనరరు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకు ముందటి 41 రోజుల మండల పూజాదికాల ఘట్టం రెండురోజుల క్రితం పరిసమాప్తం అయింది. దీనితో ఆలయాన్ని మూసి ఉంచారు.
ఇప్పుడు రెండో ఘట్టం మకరవిలక్కుకు ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక జనవరి 15వ తేదీన సంబంధిత పర్వదినం జరుగుతుంది. దీనికి ముందు జనవరి 13, 14 తేదీలలో కీలకమైన ప్రసాద శుద్ధ క్రియ, బింబ శుద్ధ క్రియలు జరుగుతాయని దేవస్థాన మండలి (టిడిబి) ప్రకటన వెలువరించింది.
- Advertisement -