Wednesday, January 15, 2025

సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శుక్రవారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని నివాసంలో సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఇంట్లో బిఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా ఆమెను అడ్డుకున్నారు.

నగరంలోని శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న అరెకపూడి గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. నిర్బంధాలు, ఆంక్షలు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు.   ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు. ప్రజా పాలన అంటే నిర్బంధాలా? అని సబితా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News