Wednesday, January 22, 2025

బిజెపి ‘తంత్రంపై’ భగ్గు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై
సబితా ఇంద్రారెడ్డి ఘాటు కౌంటర్

కేబినెట్‌లో ఇద్దరు మహిళలం ఉన్నామని వివరణ ఆ మాత్రం
సమాచారం నిర్మల దగ్గర లేకపోవడం విచారకరమని వ్యాఖ్య బిజెపి
బాబులు బండిని అలా వదిలేయకండని కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళలకు రాష్ట్ర క్యాబినెట్‌లో చోటిస్తే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో మహిళలను టిఆర్‌ఎస్ క్యాబినెట్లోకి తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం తెలిసిందే. దీనిపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అమ్మా, నిర్మలా సీతారామన్ గారూ.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నాం అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘నేను నా కొలీగ్ సత్యవతి రాథోడ్ మంత్రులుగా పనిచేస్తున్నాం. గత మూడేళ్లుగా సిఎం కెసిఆర్ ఘనతర నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మేం మంత్రులుగా సేవలందిస్తున్నాం. ఇద్దరు మహిళా మంత్రులు తెలంగాణ క్యాబినెట్‌లో ఉన్నారన్న కనీస సమాచారం మీకు తెలియకపోవడం బాధాకరం’ అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.

నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే…

మంత్రాలు, తంత్రాలు అనే నెపంతో సచివాలయానికి వెళ్లలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేయని వారు దేశాన్ని అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో టిఆర్‌ఎస్ ఆవిర్భవించిందని, నీళ్లు.. నిధులు, నియామకాలు అనే మూడు నినాదాలతో టిఆర్‌ఎస్ ప్రజల ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. కుల రహిత సమాజం నిర్మించడమే టిఆర్‌ఎస్ లక్షం అన్నారని పేర్కొన్నారు. కానీ 2014 నుంచి 2018 వరకు మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించలేదన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలుత మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని, ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నించడంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ జరపట్లేదని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ సర్కారు నిధులు, నియామకాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News