Monday, December 23, 2024

చిన్నారులకు వాక్సిన్ ను ప్రారంభించిన మంత్రి సబితా..

- Advertisement -
- Advertisement -

Sabitha begins vaccination for 15 to 18 age at Meerpet

హైదరాబాద్: మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రంగారెడ్డి జిల్లా చిన్నారుల వాక్సిన్ ప్రక్రియకు విద్యా మంత్రి సబితా రెడ్డి శ్రీకారం చుట్టారు. అలాగే, బాలపూర్ యూపిహెచ్ సిలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన వెయిటింగ్ హాల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుండి చిన్నారులకు వాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నారు. 15 సంవత్సరాల నుండి 18 ఏళ్ల లోపు 22 లక్షల 78 వేల 683 మందికి వాక్సిన్ వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం 6 లక్షల మంది నమోదు చేసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య శాఖ చిన్నారులకు వాక్సిన్ వేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల 35 వేల మందిని గుర్తించాం, వారందరికీ వంద శాతం వాక్సిన్ వేసి జిల్లా ముందు వరుసలో ఉండాలి.

ఈ వయసులో ఉండే పాఠశాల, కళశాల విద్యార్థుల వాక్సిన్ కోసం ఆయా విద్యాలయాలు చొరవ చూపాలి. అందరూ వాక్సిన్ వేసుకునేలా చూడాలి. 18 ఏళ్ల పైబడిన వారు కూడా మిగిలి ఉంటే రెండు డోసుల వాక్సిన్ వేసుకోవాలి. భౌతిక దూరంతో పాటు, మాస్క్ లు పెట్టుకోవటం, చేతులు కడుకోవటం, శానిటేషన్ తదితర వాటిని విస్మరించవద్దు. కోవిడ్ వివిధ వేరియంట్ ల దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలి. వాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. మొదటి డోసును 114 శాతం పూర్తి చేసిన రంగారెడ్డి వైద్య బృందానికి అభినందనలు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా నష్టపోయాం.విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి అని కోరారు. ఈ కార్యక్రమాలలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, కార్పొరేటర్లు, వైద్య అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Sabitha begins vaccination for 15 to 18 age at Meerpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News