Sunday, January 19, 2025

బ్యాంకుల వేధింపులే మా నాన్న చావుకు కారణం: ఫజల్ కుమార్తె

- Advertisement -
- Advertisement -

బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫజల్ అలీ కుమార్తె సంబ్రిన్ ఆరోపించారు. ఫజల్ ఆదివారం ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.

అయితే తాము బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా, వాటిని సక్రమంగా చెల్లించామనీ, అయినా వడ్డీ రేట్లు ఎక్కువ  వేసి, ఇంకా చెల్లించాలంటూ అధికారులు వేధిస్తున్నారనీ సంబ్రిన్ ఆరోపించారు. తన తండ్రి మరణానికి కారణమైన బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News