Sunday, December 22, 2024

విద్యా కుసుమానికి మంత్రి సబితా అండ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ న్యూస్: రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గము సరూర్ నగర్ కు చెందిన ఉద్యమకారిణి సుధ కూతురుకు ఎంబిబిఎస్ లో మంచి ర్యాంకు రావడంతో సీటు వచ్చింది. ఫీజు నిమిత్తం లక్ష రూపాయలను యువ నేత ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ రెడ్డి అందజేశారు. ఓ విద్యా కుసుమానికి మంత్రి అండగా నిలిచారు. మంచి ర్యాంక్ తో ఎంబిబిఎస్ లో సీటు సాధించిన ఓ విద్యార్థినికి ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల సహాయం అందించారు. ఇటీవల సరూర్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారిణి, ప్రస్తుత బిఆర్ఎస్ నాయకురాలు సుధ కూతురు వెన్నెలను మంత్రి అభినందించారు. ఫీజుకు సంబందించి మంత్రి దృష్టికి తీసుకురాగా అప్పుడే సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఫీజుకు సంబందించిన లక్ష రూపాయల చెక్ ను ఇంద్రన్న ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ రెడ్డి సుధకు అందజేశారు.ఈ సందర్భంగా సుధ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News