Sunday, December 22, 2024

బొకేలు,శాలువాలు వద్దు: మంత్రి సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు,శాలువలు తీసుకురావొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇతర నేతలను,అధికారులను కలవటానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు,బ్యాగులు,వాటర్ బాటిల్స్,పెన్నులు,పెన్సిళ్లు,అంగన్‌వాడి పిల్లలకు మ్యాట్లు,చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు.

రానున్న నూతన సంవత్సరము 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని,అమలు చేయాలని సూచించారు. నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజహిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు. ప్రజలు,ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలని అన్నారు. నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News