Wednesday, January 22, 2025

డిఎస్‌సి 98 అభ్యర్థులకు త్వరలో న్యాయం..మంత్రి సబిత హామీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి డిఎస్‌సి 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు త్వరలోనే న్యాయం చేయిస్తానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో డిఎస్‌సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2015లో వరంగల్ ఎంపిగా పసునూరి దయాకర్ అపూర్వ విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తమకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటన చేశారని,

ఆ తర్వాత ప్రగతిభవన్ లో డిఎస్‌సి98 ప్రతినిధి బృందతో రెండున్నర గంటలపాటు చర్చలు జరిపి మానవతా దృక్పథంతో తప్పక ఉద్యోగాలిచ్చి ఆదుకుంటామని అభయం ఇచ్చారని గుర్తుచేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,072 మంది ఉద్యోగాలిచ్చి న్యాయం చేశారని శ్రీనివాస్ మంత్రి సబితకు తెలియజేశారు. ఆమె స్పందిస్తూ కేబినేట్ సబ్ కమిటీతో చర్చించామని, సిఎంతో మాట్లాడి న్యాయం చేయిస్తామని అన్నారు. మంత్రి సబితను కలిసిన వారిలో సాధన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంటా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.యాదగిరి రెడ్డి, సాధన సమితి నాయకుడు బాల్ రాజ్ గౌడ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News