Wednesday, January 22, 2025

పేపర్ లీకేజీ వెనుక ఎవరు ఉన్న వదిలిపెట్టం: సబితా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీలో బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెన్త్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సాప్‌లో పేపర్ సర్కూలేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కోణంలోనే కొందరూ ఆలోచన చేస్తున్నారని, పరీక్ష ప్రారంభం అయ్యాక పేపర్ షేర్ చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్‌పై బాధ్యత ఉన్న ఏ పార్టీ ఇలా చేయదని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్‌లోకి సిబ్బంది కూడా ఫోన్ తీసుకపోవద్దని ఆదేశాలు జారీ చేశారు. టెన్త్ పేపర్ లీకేజీల వెనుక తెలంగాణ బిజెపి రాష్ట్ర బండి సంజయ్ కుమార్ హస్తం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అతడిని కరీంనగర్‌లో అరెస్టు చేసి యాదాద్రిలోని బొమ్మలరామరం పోలీస్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News