Sunday, December 22, 2024

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులు:.సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళల కో సం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు యువతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాలు కల్పిస్తామని విద్యాశాఖమంత్రి మహేశ్వరం బిఆర్‌ఎస్ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డి ప్రజలకు హామి ఇచ్చారు. శనివారం మ హేశ్వరం నియెజకవర్గంలో రావిరాల, మౌబాత్‌నగర్, తుమ్ములూర్, మహేశ్వ రం, కెసితాండ, ఎన్‌డితాండ, దయ్యాలగుండు తాండలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు రైతుబందు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృ ష్టించినా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగింద ని రాష్ట్రంలో మూడోసారి బిఆర్‌ఎస్ సర్కార్ ఏర్పాటు అవుతుందని మహేశ్వరంలో తిరుగులేని మెజార్టి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్దికి ప ట్టం కట్టండి బిఆర్‌ఎస్‌ను ఆదరించండి అభివృద్ది పట్టకుండా ఐదేళ్ల కొక్కసారి ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే వారిని ఓటుతో బుద్ది చెప్పండి ఎల్లవేళాలా మీతో ఉండేవారిని బలపర్చండి అన్నారు. రానున్న కాలంలో తుక్కుగూడ ప్రాంతం మ రోహైటేక్‌సిటిగా నూతన నగరంగా మరబోతుందని అన్నారు.

6వందల కోట్ల తో శంషాబాద్ ఎయిర్పోట్‌నుండి తుక్కుగూడ మీదుగా కందుకూర్ వరకు మె ట్రో రైలు ఈప్రాంతం దశ దిశ ఉహలకందని విధంగా మరుతుందన్నారు. మ హిళలకు వంటింటి కష్టాలు తెచ్చి గ్యాస్ ధరను 12వందలకు పెంచిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలు పెంచి ఎన్నికలు రాగానే ధరలు పెంచకుండా ఫలితాలు రాగానే తిరిగిపెంచుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే 4వందలకే గ్యాస్ సిడిలిండర్‌తో పాటు 5వేల పెంన్షులు వికలాంగులకు 6వేలు పెంచబోతున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రతి నెల సౌభాగ్యలక్ష్మిపథకం ద్వారా 3వేలు అందిస్తామని రైతుభీమా లాగా 93 లక్షల తెల్లరేషన్‌కార్డు దారులకు భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.నియోజకవర్గంలో మెడికల్ కళాశాల కూడా శంకుస్థాపన చేసినట్లు వ చ్చె విద్యాసంవత్సరం నుండి అందుబాటులోకి వస్తుందని రంగారెడ్డి జిల్లా నేడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించిందన్నారు.జిల్లాలో ఎకరం వం దకోట్లకు ధర పలుకుతుందని అంటే పరిశ్రమలు స్వర్గ ధామంగా మారిందని అంటే అందులో ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి ఎంతో ఉందన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు.

మహేశ్వరం ని యోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి అన్ని రంగాల అభివృద్దికి బాటలు వేసినట్లు తెలిపారు.కందుకూర్ మండలంలో మెడికల్ కళాశాల 450 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తుక్కగూడలో ఇప్పటికే 52 కంపెనీలు రాగా ఫ్యాక్స్‌కాన్ అమెజాన్ మలాబార్ గోల్డ్‌సిటి లాంటి అంతర్జాతీయ ప్రపంచ స్థాయి సంస్థలకు. ఏర్పాటుతో లక్షల మందికి ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టిలు రై తు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం డిల్లిలో రైతుల ఉ సూరు పోసుకుందని కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో 3గంటల విద్యుత్ ఇస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాంతాల అభివృద్ది కృషి చేస్తున్న ట్లు 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నా రు. తాగునీటి సమస్య లేకుండా చేయడానికి 280కోట్లతో మిషన్ భగీరథ ద్వా రా పనులు చేపడుతున్నట్లు నూతనంగా ఫైప్ లైన్ల ట్యాంకులు రిజర్వాయర్ల ని ర్మాణం జరుగుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 280 కోట్ల భారీ నిధులతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పేర్కోన్నారు. 40 కోట్లతో అర్బన్‌ఫారేస్టు పార్కులను అభివృద్ది చేసినట్లు సబితాఇంద్రారెడ్డి తెలిపా రు.

పురాతన దేవాలయాల అభివృద్దికి కోట్లతో, 450 కోట్లతో రోడ్ల అభివృద్ది పంచాయతిరాజ్‌శాఖ ద్వారా అభివృద్ది చేసుకున్నామని తెలిపారు పోరపాటున బిజెపి కాంగ్రెస్‌కి ఓటు వేయవద్దని కోరారు. ఈనెల 30న కారుగుర్తుపై ఓటు వే సి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మంత్రి సబితమ్మను భారీ మెజార్టితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జడ్పిచైర్‌పర్సన్ తీగల అనితాహారినాథ్‌రెడ్డి, ఎంపిపి సునితాఅంద్యానాయక్, బిఆర్‌ఎస్ నాయకులు వి.మల్లేష్, జె.లక్ష్మ య్య, బాటసురేస్, జైపాల్‌రెడ్డి, లింగం సురేష్, సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ కె.ప్రియాంకరాజేష్, జె.మో తిలాల్, ఎం.రాజునాయక్ నాయకులు, ఎ.రాజునాయక్, కూనయాదయ్య పి. అంబయ్యయాదవ్, కె.చంద్రయ్య, ఎం,నవీన్, ఎస్.నందం, ఎన్.సుధీర్‌గౌడ్, కె.ప్రభాకర్, అదీల్‌అలీ, ఎంఎ.సమీర్, మీనాజ్‌పటేల్, అజీమ్, డి.శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, ఎ.గోపాల్‌నాయక్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News