Friday, April 4, 2025

సిఎం కెసిఆర్‌తో మంత్రి సబిత భేటీ..

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్‌తో మంత్రి సబిత భేటీ
బాసర ఆర్‌జియుకెటి విద్యార్థుల సమస్యలపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టుల నియామకాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలలో అధ్యాపక పోస్టులను పోస్టుల భర్తీని ప్రత్యేక నియామక బోర్డు ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా, తాజాగా బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై సిఎం సంతకం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీలలో నియామకాలు, బాసర ఆర్‌జియుకెటి విద్యార్దులతో జరిపిన చర్చల గురించి మంత్రి ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. వివిధ అంశాలపై దాదాపు గంటకుపైగా సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

Sabitha Indra Reddy Meet CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News