- Advertisement -
రంగారెడ్డి: గతంలో మొక్కలు నాటడం మొక్కుబడిగా ఉండేదని, సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా మార్చారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు పర్యటించారు. నాగారంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంద్రాకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. హరితహారంలో ప్రజలందరినీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్భన్ ఫారెస్ట్ పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని సూచించారు. వారంలో ఒక రోజు స్థానికులకు ఉచితంగా ఎంట్రీ సౌకర్యం కల్పిస్తామన్నారు.
- Advertisement -