Saturday, December 21, 2024

కోట్ పల్లి ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి….

- Advertisement -
- Advertisement -

 

వికారాబాద్: కోట్ పల్లి చెరువు దగ్గర జరిగిన సంఘటన పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ ప్రాంతానికి చెందిన వారి విహార యాత్ర విషాదంగా మారటం ఎంతో బాధ కలిగించిందని వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే వారి ఆచూకీ కోసం గాలించాలని, పోలీసులకు అదేశించిట్లు తెలిపారు. నాలుగు మృతదేహాలు లభించాయని, వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనపై వికారాబాద్,పరిగి ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్, ఎస్ పి లతో మంత్రి మాట్లాడారు. కోట్ పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు యువకులు  మృతిచెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News