Sunday, December 22, 2024

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా.. లేనట్టా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: స్కూళ్లను బాగు చేయకుండా విద్యార్థులకు సరిగా బో ధించకుండా ఎంతసేపూ ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను ఎలా గుంజుకుందాం? ఎలా ఇ బ్బంది పెడదాం? ప్రతిపక్ష ఎంఎల్‌ఎల గొంతు ఎలా నొక్కుదాం? అనే సిఎం రే వంత్ రెడ్డి పాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ను ఎంఎల్‌ఎ సబితా ఇం ద్రారెడ్డితో కలసి ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రోడ్లపై ఆందోళనలకు దిగుతున్నారంటే ప్రభుత్వ తీరు ఎ లా ఉందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ‘పాలన వదిలిపెట్టావ్.. నేలను విడిచి సా ము చేస్తున్నావ్.. నువ్వు చేయాల్సిన పని పిల్లలకు సరైన ఆహారం అందించి.. సరైన విద్య బోధన చెప్పించు’ అని సిఎం తీరుపై మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని, ముఖ్యమంత్రి చేతిలోనే విద్యాశాఖ ఉండి ఈ పరిస్థితి ఏర్పడిందంటే ముఖ్యమంత్రి ఫెయిల్యూర్‌గా పరిగణించాల్సి వస్తుందని అన్నారు.

విద్యార్దులు వి షాహారం తిని, ఎలుకలు కరిచి హాస్పిటళ్ల పాలవుతున్నారని, పాములు కరిచి చనిపోతున్నారని అన్నారు. కెసిఆర్ హయాం లో తెలంగాణ గురుకులాలు అంటేనే దేశానికి ఆదర్శంగా ఉండేవని, చదివితే గురుకులా ల్లో చదవాలని తల్లిదండ్రులు అనుకునేవారని అన్నారు. కానీ ఈ రోజు పిల్లలను చూ సిన తల్లిదండ్రులు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారని అన్నారు. స్కూల్ క్లాస్ రూమ్‌లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్ సరిత, అధ్యాపకులు భారతి, సరిత, అప ర్ణ, ప్రశాంతి, పద్మావతి, జకియా బేగం త మను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వి ద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అ న్నంలో పురుగులు వచ్చాయని చెబితే తీసే సి తినాలని ఆర్డర్ చేశారని వాపోయారు. ఉపాధ్యాయుల ఇబ్బందులు తాళలేక వి ద్యార్థినులు రోడ్డుకి బైఠాయించి నిరసన తెలియజేశారని అన్నారు. పాఠశాల పరిస ర ప్రాంతాలు విద్యార్థుల క్లాస్ రూములతో పాటు వంటశాలలో తిరిగి పరిశీలించి అన్నం ఎలా ఉందో పరిశీలించారు. అనంతరం క్లాస్ రూమ్‌లో విద్యార్థులను కలిసి వారి సమస్యల పైన అడగగా విద్యార్థులు తీవ్ర ఆందోళనతో చెందుతూ స్కూల్లో సరైన ఆహారం అందించడం లేదని అన్నంలో సాంబారులో పురుగులు వస్తున్నాయని,

గు డ్లు కూడా సరిగా పెట్టడం లేదని, అన్నం లో, కూరలలో పురుగులు వస్తున్నాయని అడిగితే వాటిని తీసేసి తినమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విద్యార్థినులు వాపోయారు. స్కూల్లో ఇప్పటివర కు ఒకటి డ్రెస్ ఇచ్చారని అన్నారు.తమ త ల్లిదండ్రులను కూడా కులం పేరుతో దూషిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్స రం వరకు బాగానే ఉన్న గురుకులాలు ఇ ప్పుడు ఎందుకు ఇలా మారాయని విద్యార్దుల తల్లిదండ్రుల అంటున్నారని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల ను తిడుతున్నారంటే ప్రభుత్వం విద్యాశాఖ ను గాలికి వదిలేస్తునట్లు కనిపిస్తుందని చెప్పారు. గురుకులంలో విద్యార్థులకు సరై న వసతులు లేవని అసెంబ్లీలో చెప్పినా ఇ ప్పటికీ ప్రభుత్వం గురుకులాలను సందర్శించలేదని తెలిపారు. అన్నెం పుణ్యం ఎ రుగని పిల్లలు రోడ్డుపైకోస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చి గురుకులాల్లో చదివేది పేద విద్యార్థులు సమస్యపై స్పందించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి, దిద్యాల శ్రీనివాస్, పెద్దగండు పవిత్ర సాగర్, బుర్కుంట సతీష్, చక్రధర్ రెడ్డి, శం కర్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, ఉద్యమకారు లు మోహన్ రావు, రాజేందర్, గుంటి చర ణ్, గౌస్ పాషా, వీరేష్, శ్రీనివాస్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News