Tuesday, December 3, 2024

సబితా వర్సెస్ రేవంత్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై ఎందుకు కక్ష కట్టారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం అవుతావని తానే చెప్పానని, సిఎం అవుతావని కూడా చెప్పానని, మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించానన్నారు

సబితక్క తనని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు కాబట్టే అప్పుడు జరిగిన పరిణామాలను సభలో చెప్పాల్సి వచ్చిందన్నారు. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని, మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని సబితా హామీ ఇచ్చారని, కాంగ్రెస్ తనని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బిఆర్‌ఎస్‌లో  సబితా చేరారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను చెప్పింది నిజమో కాదో సబితక్క గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని నిలదీశారు. అధికార కోసం కాంగ్రెస్‌ను వదిలి బిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని ధ్వజమెత్తారు. తమ్ముడిగా తనని సబితక్క మోసం చేశారని కాబట్టే కెటిఆర్‌ను నమ్మవద్దని చెప్పానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News