Sunday, February 23, 2025

వికారాబాద్ లో రైతు బంధు సంబరాలు..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: రైతు బంధు 50వేల కోట్లకు చేరటంతో వికారాబాద్ జిల్లాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం  తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రైతులు ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎడ్ల బండ్లు, భారీగా ట్రాక్టర్ లతో రైతులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ నినదించారు. తాండూరు ప్రధాన రహదారిపై నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డికి స్థానికులు, మహిళలు, యువత అభివాదం తెలిపారు.

Sabitha participate in Rythu Bandhu celebrations in Tandur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News