Tuesday, January 21, 2025

హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి: మంత్రి సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్ఎండిఏ పరిధిలో అభివృద్ధిపై సిఎం కెసిఆర్ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టును సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపురిలో రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ”ఒక ప్రత్యేకమైన విజన్ తో ముఖ్యమంత్రి నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేశారు. నార్సింగ్ దగ్గర ORRపై వెళ్ళడానికి అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసితో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. నాళాలు, రోడ్లు, చెరువుల సుందరికరణ, త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నాం” అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణీ దేవి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జలమండలి ఎండి దానకిషోర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sabitha speech after ORR Phase-2 Inaugurates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News