Thursday, January 23, 2025

మరో సచిన్ వచ్చేస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

- Advertisement -
- Advertisement -

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మీద అభిమానంతో అతని పేరే తన కొడుక్కి పెట్టుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. పదిహేడేళ్లు  గడిచాయో లేదో ఇప్పుడు అతని కొడుకు నిజంగానే సచిన్ లా ఆడుతున్నాడు. అంతే కాదు, రేపో మాపో టీమిండియాలో చోటు సంపాదించినా ఆశ్చర్యపోనక్కరలేదు. పదిహేడేళ్ల వయసులోనే బౌండరీలు, సిక్సర్లూ బాదుతూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు ఈ జూనియర్ సచిన్.

మంగళవారం సౌతాఫ్రికా- ఇండియా మధ్య జరిగిన ప్రపంచ కప్ అండర్ -19 సెమీఫైనల్ మ్యాచ్ చూసిన వారికి సచిన్ దాస్ పేరు తెలిసే ఉంటుంది. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఇండియాను ఫైనల్ కి చేర్చిన బ్యాటర్ అతను. మొదటి 12 ఓవర్లలోనే 32 పరుగులకు ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది. ఆ సమయంలో గెలుపు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు సచిన్ దాస్. 95 బంతుల్లో 96 పరుగులు చేసి, జట్టును విజయతీరాలకు చేర్చాడు.

సచిన్ దాస్ సొంత ఊరు మహారాష్ట్రలోని బీడ్. అతని తండ్రి సంజయ్ దాస్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆయనకు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో సంజయ్ కూడా క్రికెట్ ఆడేవాడట. తనకు కొడుకు పుడితే మంచి క్రికెటర్ ని చేయాలని కలలు కనేవాడు. అనుకున్నట్లే కొడుకు పుట్టాడు. దాంతో తనకు ఇష్టమైన సచిన్ టెండూల్కర్ పేరునే కొడుక్కి పెట్టుకున్నాడు. నాలుగో ఏటనుంచే కొడుక్కి క్రికెట్ లో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టాడు. స్వయంగా క్లిష్టమైన పిచ్ లు రూపొందించి, కొడుకుని ఆ పిచ్ లపై ఆడించేవాడు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేసేవాడట. సచిన్ చక్కటి క్రికెటర్ గా ఎదుగుతున్నాడంటే తనతోపాటు అతని కోచ్ అజర్ కు కూడా  క్రెడిట్ దక్కుతుందని సంజయ్ దాస్ అన్నారు.

సచిన్ తల్లి సురేఖా దాస్ మహారాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఒకప్పడు  కబడ్డీ క్రీడాకారిణి కావడం విశేషం.

Sachin das story in Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News