Monday, December 23, 2024

వీరాభిమానితో రోడ్డుపై సచిన్ బాతాఖానీ!

- Advertisement -
- Advertisement -

లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైరై పదేళ్లు దాటినా ఇప్పటికీ సచిన్ పేరు చెబితే పూనకాలెత్తిపోయే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఇలాంటివారిలో ఓ వీరాభిమాని గురించి సచిన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ వీడియా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సచిన్ గురువారంనాడు ముంబయిలో కారు వెళ్తుంటే, తన ముందు ఓ వ్యక్తి ముంబయి ఇండియన్స్ జెర్సీ ధరించి వెళ్ళడం కనిపించింది. అతని జెర్సీ వెనకాల ‘ఐ మిస్ యూ టెండూల్కర్’ అని ప్రింట్ చేసి ఉంది. అది చూసిన సచిన్, ఓవర్ టేక్ చేసి, ఆ స్కూటరిస్టును ఆపాడు. స్కూటర్ ఆపిన వ్యక్తి తల తిప్పి చూస్తే, కారులో సచిన్ కనిపించడంతో ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. సచిన్ కు నమస్కారం చేసి, అతనంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాడు. అంతటితో ఆగలేదు. తన చేతిపై సచిన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నానంటూ చేతిని చూపించడంతో సచిన్ కు నోట మాట రాలేదు. అతనికి సచిన్ షేక్ హ్యాండిచ్చి, థాంక్స్ చెప్పి అక్కడినుంచి కదిలాడు.

ఈ సంఘటన గురించి సచిన్ వీడియో పోస్ట్ చేసి, ‘ఈ సంఘటనతో నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఊహించనివిధంగా, ఇలాంటివారు కనబరిచే ఆదరాభిమానాలు జీవితానికి ఎంతో ప్రత్యేకతను చేకూరుస్తాయి’ అంటూ కామెంట్ పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News