Sunday, December 22, 2024

సచిన్‌ను ఔట్ చేసిన బిగ్‌బాస్ విన్నర్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ముంబయి: క్రికెట్ మాజీ దిగ్గజాలు, సెలబ్రిటీల మధ్య జరిగిన ఇండియన్ స్ట్రీట్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో బిగ్‌బాస్ విన్నర్ మునావర్ పరూఖీ బౌలింగ్‌లో టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఔటయ్యారు. ఏకంగా సచిన్‌ను ఔట్ చేయడంతో మునావర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహారాష్ట్రలోని థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాస్టర్ లెవెన్- ఖిలాడీ లెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. మాస్టర్ లెవెన్‌కు సచిన్ కెప్టెన్ ఉండగా ఖిలాడీ లెవెన్‌కు అక్షయ్ కుమార్ కెప్టెన్‌గా ఉన్నాడు. సచిన్ 16 బంతుల్లో 30 పరుగులతో దూకుడుగా ఆడుతున్న సమయంలో మునావర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో సిక్స్ కొట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో గాల్లోకి లేసింది. కీపర్‌గా ఆ బంతిని అందుకున్నాడు. చివరకు ఈ మ్యాచ్‌లో మాస్టర్ లెవెన్ విజయం సాధించింది. ఈ లీగ్‌లో హైదరాబాద్ జట్టును రామ్‌చరణ్, ముంబయి జట్టును అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టును అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టును హృతిక్ రోషన్, చెన్నై జట్టును సూర్య, కోల్‌కతా జట్టును సైఫ్ అలీఖాన్ కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News