Wednesday, January 15, 2025

11న సచిన్ పైలట్ కొత్త పార్టీ ?

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్‌కు సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతప్రయత్నించినా ఫలించడం లేదు. గత బిజేపి ప్రభుత్వం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ గెహ్లాట్‌కు గడువు విధించిన పైలట్ చివరకు వేరు కుంపటి పెట్టుకోడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ నెల 11న ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. పైలట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పైలట్ తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతిని పురస్కరించుకుని 11న కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు.

దీనికోసం ప్రొగ్రెసివ్ కాంగ్రెస్, రాజ్‌జనసంఘర్ అనే రెండు పేర్లను ఇప్పటికే ఆయన రిజిస్టర్ చేయించారు. 11న రాజేష్ పైలట్ నియోజకవర్గం డౌసాలో భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి స్పందన కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. ఆయన ప్రధానంగా పరీక్ష పేపర్ లీకేజీ కుంభకోణంతో సహా అవినీతిపై దృష్టికేంద్రీకరించారని, అవినీతిపై పోరాటాన్ని ముందుకు సాగించడానికి ప్రత్యామ్నాయ కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని భావిస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News